Peddireddy Midhun Reddy meets CEO Gopal Dwivediఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఫార్మ్-7 పేరుతో టీడీపీ ఓట్లు తొలగించే ప్రయత్నం చేసినా ఇప్పటివరకు పోలీసులకు ఎన్నికల సంఘం సహకరించడం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా వేల సంఖ్యలో ఈవీఎంలు మొరాయించిన అబ్బే అదేమీ లేదు అంటూ బుకాయించబోయారు ఆయన. ఎవరి మెప్పు కోసమో తెలీదు కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రభుత్వాన్ని పని చెయ్యడం లేదు ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది.

కేంద్రంలో మంత్రులు కూడా సమీక్షలు జరుపుతున్నారు కదా అంటే వారి సంగతి తెలీదు నా దగ్గర కుదరదు అని చెప్పేస్తున్నారు. దీనితో టీడీపీ నాయకులు ఆయన మీద విరుచుకుపడుతున్నారు. అయినా పంథా మార్చుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే రాజంపేట ఎంపీ అభ్యర్థి మిధున్ రెడ్డి నిన్న సాయంత్రం ద్వివేదీని కలుసుకున్నారు. గంట పాటు ఆయన ఒక్కరే… ద్వివేదీతో చర్చలు జరిపారు. ఇతరులను లోపలికి అనుమతించలేదు. పైగా బయట ఓ వైసీపీ నేత కాపలా కూర్చున్నారు.

ఆయన ఎందుకు కలిసింది అనే విషయం ఎన్నికల సంఘం తెలపలేదు. మీటింగు తరువాత మిధున్ రెడ్డి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీనితో ఈ భేటీ మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూంలలో అర్ధరాత్రి కరెంటు పోయి సీసీ కెమెరాలు పని చెయ్యకపోవడం విశేషం. టీడీపీ దీని మీద విమర్శలు చేస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం చాలా రిలాక్స్డ్ గా ఎన్నికల సంఘానికి మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది.