YS Jagan - PV Sindhuతెలుగు తేజం పీవీ సింధూ ఇటీవలే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ షిప్ గెలిచి భారత కీర్తి పతాకన్ని ఎగురవేసింది. సింధూని కోచ్ పుల్లెల గోపీచంద్ ని తమ వద్దకు పిలిపించుకుని మరీ ప్రధాని నుండి తెలంగాణ సీఎం వరకూ సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సింధూకు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. దానిపై విమర్శలు వస్తుండడం ఎట్టకేలకు ఆమెను తన వద్దకు పిలిపించుకున్నారు ముఖ్యమంత్రి జగన్.

పనిలో పనిగా ఆమెకు ఐదు ఎకరాల నజరానాను ప్రకటించారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ఈ స్థలం కేటాయించనున్నారు. ఇది ఇలా ఉండగా జగన్ వద్దకు పుల్లెల గోపీచంద్ వెళ్ళకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సహజంగా ఇటువంటి కార్యక్రమాలకు గోపీచంద్ కూడా సింధూ వెంటే ఉంటారు. కాకపోతే గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్లే గోపీచంద్ రాలేదని తెలుస్తుంది.

గతంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు స్థలం ఇచ్చారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ స్థలాన్ని వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నించడంతో గోపీచంద్ చాలా కాలం కోర్టులలో పోరాడి నిలుపుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి సింధూ ఆ అకాడమీలోనే శిక్షణ పొంది నేడు దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. అది మనసులో పెట్టుకుని గోపీచంద్ రాలేదా? లేకపోతే ప్రభుత్వమే ఆయనను పిలవలేదా?