Payal-Rajputచాలా మంది హీరోయిన్లు రిజెక్ట్ చేసినటువంటి పాత్రను పోషించి, “ఆర్ఎక్స్ 100” ద్వారా తానేమిటో నిరూపించుకున్న పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ బ్యూటీ. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి, అవసరమైతే ఇక్కడే సెటిల్ అయిపోతా అంటూ స్టేట్మెంట్ లు ఇచ్చిన ఈ బ్యూటీ, ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఫోటోషూట్ లు నిర్వహిస్తోంది.

అందులో భాగంగా ఇచ్చిన ఓ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన పొడుగు కాళ్ళ సౌందర్యాన్ని బహిర్గతం చేస్తూ ఇచ్చిన ఫోజులు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ టాప్ ధరించి ఇచ్చిన ఈ ఫోటోలు పాయల్ కు ఎన్ని అవకాశాలను ఇస్తాయో తెలియదు గానీ, వీక్షకులకు మాత్రం కన్నులవిందుగా మారాయి.