ఈ అమ్మడికి మరీ లౌక్యం లేనట్టు ఉంది

payal rajput given clarity on rumours came on herకొన్ని రోజుల క్రితం ఆర్ఎక్స్ 100 తో సంచలనం సృష్టించిన పాయల్ రాజపుట్ నాగార్జున బంగార్రాజు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చెయ్యబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వెంటనే తాను చెయ్యడం లేదని ఆమె చెప్పేసింది. తాజాగా ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గొనమని కూడా ఆఫర్ వచ్చిందని రెండు రోజుల నుండి వార్తలు వినిపించాయి.

తన ట్విట్టర్‌ అకౌంట్ లో పాయల్ రాజపుట్ అవన్నీ పుకార్లు అని త్రోసిపుచ్చాడు. తాను బిగ్ బాస్ 5 తెలుగులో భాగం కానని ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి పుకార్లలోకి తనను లాగవద్దని ఆమె అభ్యర్థించింది. అయితే ఈ రెండు ఉదంతాలు బట్టి ఈ అమ్మడికి కొంచెం లౌక్యం తక్కువే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పాయల్ కు ప్రస్తుతానికి ఆఫర్లు లేవు… ఈ సమయంలో ఏవో ఆఫర్లు వస్తున్నాయని వార్తలు రావడం మంచిదే కదా. నిజంగానే బిజీ హీరోయిన్ అనుకుని ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా రావొచ్చు. పైగా ఈ రెండు ఆఫర్లలో తక్కువ స్థాయి ఆఫర్లు కాదు. వాటి పేరిట వార్తల్లో ఆమె పేరు నలిగితే మంచిదే కదా?

పాయల్ చివరి సారిగా గత ఏడాది జనవరిలో విడుదలైన రవితేజ డిస్కో రాజాలో కనిపించింది. లాక్ డౌన్ సమయంలో అనగనగా ఓ అతిధి అనే సినిమాలో నటించింది. ఆ కన్నడ రీమేక్ సినిమా ఆహా వీడియోలో (ఓటీటీలో) డైరెక్ట్ గా విడుదలైంది. ప్రస్తుతానికి ఆమెకు ఎటువంటి ఆఫర్లు లేవు.

Follow @mirchi9 for more User Comments
Modi Needs Jagan's Approval Even For That?Don't MissModi Needs Jagan's Approval Even For That?A section of media supporting YSR Congress seems to be hitting new highs in sycophancy....YS Jagan - Narendra ModiDon't MissWhat Did Modi Offer Jagan For This Favor?Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy toured the National Capital for two days....KCR Follows Jagan ModelDon't MissKCR Follows Jagan ModelIt looks like the Chief Ministers of both the Telugu states are competing with each...Don't MissArdha Shathabdham Review - A Crude Caste DramaBOTTOM LINE A Crude Caste Drama OUR RATING 2/5 PLATFORM Aha Video What Is the...RRR: NTR and Ram Charan Fans Latest ArgumentDon't MissRRR: NTR and Ram Charan Fans Latest ArgumentAs they say, an idle man's brain is a devil's workshop. With no movie releases,...
Mirchi9