payal-rajput - Casting couchటాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నామరూపాలు లేకుండా పోవాలంటూ శ్రీరెడ్డి చేసిన విఫలయత్నం తెలిసిందే. అంత సెన్సేషన్ అయినా, కాస్టింగ్ కౌచ్ అన్నది టాలీవుడ్ ను వీడేది లేదని తాజాగా జరిగిన ఓ ఉదంతం చెప్తోంది. కొన్ని రోజుల క్రితమే తనకు ఓ ప్రపోజల్ వచ్చిందని లేటెస్ట్ హాట్ అండ్ సెన్సేషన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

‘తనను కాంప్రమైజ్ కావాల్సిందిగా’ ఓ ప్రపోజల్ వచ్చిందని, సరిగ్గా నాలుగు రోజుల క్రితమే ఇలాంటి ఆఫర్ వచ్చిందని, బహుశా బోల్డ్ క్యారెక్టర్ చేయడం వలన తన క్యారెక్టర్ కూడా అదే అనుకున్నారో ఏమో గానీ, నా టాలెంట్ ను నమ్ముకుని వచ్చాను గానీ, ఇలాంటివి కాదు’ అంటూ కుండబద్దలు కొడుతూ, ఇది ఖచ్చితంగా ప్రింట్ చేయండి అంటూ సదరు పత్రికకు కూడా సూచనలు చేసింది.

బోల్డ్ గా నటించే విధానం కధ, ఆ కధను దర్శకుడు నమ్మించే విధానంపై ఆధారపడి ఉంటుంది తప్ప, ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరినీ ముద్దులు పెట్టుకోవడానికి తాను ఇక్కడికి రాలేదని తేల్చిచెప్పింది. మంచి పాత్రలు వస్తే తన ప్రతిభ ఏమిటో చూపించుకుంటానని, ఉత్తరాది మగువగా ఫాస్ట్ గా ఉండే తాను, పక్కా ప్రొఫెషనల్ అని పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ కు పాల్పడేవారికి చెప్పింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.