Pawan Kalyan fires on ys jagan governmentఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ పని చేస్తున్న కార్మికులలో ఆరుగురు సజీవ దహనమయిన ఉతంతం ఎవత్ రాష్ట్రాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది.మరో పదమూడు మంది తీవ్ర గాయాల పాలయ్యి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలాకు 25లక్షలు పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే బాధితులకు వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు.

వైసీపీ ప్రభుత్వం పరిహారాలు చెల్లింపులలోను రాజకీయాలు చేస్తుందంటూ పవన్ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. విశాఖ ఎల్జి ఫాలీమర్స్ ప్రమాద ఘటనలో బాధితులకు కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించిన వైసీపీ ప్రభుత్వం ఇప్ప్పుడు 25లక్షలే ప్రకటించడం సరికాదంటూ పవన్ ప్రభుత్వానికి సూచన చేశారు.

ఇలా ఒక్కో ప్రాంత ప్రజలకి ఒక్కో తీరుగా నష్ట పరిహారాలు చెల్లించడం దేనికి సంకేతం అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు స్థానిక ప్రజానీకం. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో రాజకీయాలు చేయడం తగదు అంటూ విపక్ష పార్టీలు జగన్ కు హితవు పలుకుతున్నాయి. విశాఖ దుర్ఘటనలో బాధితులకు ఎటువంటి న్యాయం చేసారో ఇక్కడి ప్రాంత ప్రజలకి అటువంటి న్యాయమే చేయాలంటూ పవన్ డిమాండ్ చేశారు.

ప్రమాదానికి కారణమైన పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ మీద తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాలంటూ, ఈ రసాయనాల కర్మాగారాలలో తరుచుగా జరుగుతున్నా ఇటువంటి పెను ప్రమాదాల కట్టడికి ప్రభుత్వాలు కంపెనీలకు తగిన భద్రతా ప్రమాణాలను సూచించాలని,నిబంధనలను పాటించని ఫ్యాక్టరీల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ పవన్ రాష్ట్ర ప్రభుత్వానికి తన బాధ్యతను తెలియచేసారు.

కష్ష్టం మీద బతికే కార్మిక కుటుంబాలకు ప్రభుత్వాలు చేదోడువాదోడుగా ఉండాలేకాని వారి చిదిరమైన జీవితాల పై రాజకీయాలు చేస్తూ, మానసికంగా కుంగిపోయిన కుటుంబాలకు ఆర్ధిక వ్యత్యాసాలు చూపించి ఆబాధితుల జీవితాలను మరింత భారం చేయడం ప్రభుత్వానికి సరికాదంటూ ప్రతిపక్ష పార్టీలు.., స్థానిక ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.