Pawan Kalyan with Akira in vijayawadada patamata house warmingనాగార్జున యూనివర్సిటీ సమీపంలోని కాజ గ్రామంలో దాదాపు 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్కడ తన ఇంటిని, కార్యాలయాన్ని జనసేన అధినేత నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన ఈ పనులు పూర్తి కావడానికి కొంత సమయం పట్టేలా ఉండడంతో, అద్దె ఇల్లు తీసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే విజయవాడ, పటమటలో ఉన్న ఈ సువిశాలమైన ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ అద్దె ఇంటిలోకి పవన్ కళ్యాణ్ ఈ ఉదయం గృహ ప్రవేశం చేశారు.

అయితే ఈ కార్యక్రమానికి పవన్ సతీమణి అన్నా లెజినోవా హాజరు కాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో తన పెద్దకుమారుడి అకీరాను వెంట బెట్టుకుని పవన్ గృహ ప్రవేశం చేయడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించగా, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున చేరిన అభిమానులు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్న పరిస్థితి. ఇక పవన్ అద్దెకు తీసుకున్న ప్రాంతం చుట్టుపక్కలా, పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఆ ప్రాంతంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. పవన్ ఆ ఇంట్లో ఉన్నంత సేపూ ప్రత్యేక సెక్యూరిటీని, 24 గంటల కాపలా ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.