pawan kalyan Vakeel Saab - Maguva Maguva song పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్, వకీల్ సాబ్ ప్రమోషన్స్ వేగంగా సాగుతున్నాయి. ఈరోజు విడుదల చేసిన మొదటి పాట ‘మగువా మగువా’ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తుల విలువను తెలియజేసే విధంగా పాటను విడుదల చేసారు చిత్రయూనిట్.

రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట ను సిద్ శ్రీరామ్ అందంగా పాడారు. ఈ మధ్య సూపర్ ఫామ్ లో ఉన్న థమన్ ఈ సినిమాకు మధురమైన సంగీతం అందించారు. మొన్న ఆ మధ్య చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పుడు చిత్ర యూనిట్ మీద విమర్శలు వచ్చాయి. స్త్రీలకు సంబంధించిన సబ్జెక్టయినా కనీసం పోస్టర్ లో హీరోయిన్ల ఫోటోలు లేవని పెదవి విరిచారు చాలా మంది.

గతంలో ఇదే కథ హిందీ, తమిళంలో వచ్చినప్పుడు ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో హీరోయిన్ల ఫోటోలు కూడా ప్రముఖంగా ఉన్నాయి. ఆ విమర్శలను సరైన సమయంలో (మహిళాదినోత్సవం నాడు) సరైన విధంగా (మహిళల గురించి గొప్ప పాటతో) తిప్పికొట్టారు వకీల్ సాబ్ చిత్ర బృందం సభ్యులు.

వకీల్ సాబ్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మే 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ రీమేక్ సినిమాను నిర్మిస్తున్నారు.