‘ఆహా’లో ప్రదర్శితమైన బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 1 పూర్తయ్యింది. ఈ సీజన్ మొత్తంలో ఒక్క మెగా హీరో కూడా షోకు రాలేకపోయారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహాకు ఒక్క మెగా కాంపౌండ్ హీరో కూడా డేట్స్ కేటాయించలేకపోయారా? అసలు ఆహా నుండి మెగా హీరోలకు ఆహ్వానం వెళ్లిందా? అంటే దానికి సమాధానం బివిఎస్ రవి నుండి వచ్చాయి.
చిరంజీవి గారితో ప్లాన్ చేసిన మాట వాస్తవమేనని చెప్పిన రవి, ఉన్నట్లుండి బాలకృష్ణ గారికి భుజానికి ఆపరేషన్ చేయాల్సి రావడం, అదే సమయంలో చిరంజీవి గారు మూడు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉండడం, కనీసం ఒక సండే కూడా ఖాళీ లేనంత బిజీగా ఆ దీపావళి సమయంలో చిరంజీవి గారు ఉండడం వలనే ఆయనతో చేయలేకపోయామని అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ అయితే తాము సంప్రదించలేదని, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన పంథాలో ఆయన వెళ్తున్నారు గనుక, పవన్ – బాలయ్యలు ఒక స్టేజ్ మీద కలిస్తే అది మరొక విధంగా దారి తీస్తుందన్న ఉద్దేశంతో తామే పవన్ కళ్యాణ్ ను కలవలేదని స్పష్టం చేసారు. ఇక రామ్ చరణ్ గురించి అనుకున్నాము గానీ, ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం దేశవ్యాప్తంగా తిరుగుతున్నారని అన్నారు.
అప్పుడు రాజమౌళి గారు ఓ మాట అన్నారని, తమకు బాలకృష్ణ అంటే ఎంతో గౌరవం, ఇష్టం, ఈ సమయంలో తన ఇద్దరు హీరోలతో చేయలేరు కాబట్టి, కావాలంటే తాను వస్తానని రాజమౌళి – కీరవాణిలు వచ్చినట్లుగా తెలిపారు. మెగా హీరోలు రాలేదన్న విమర్శ అయితే కరెక్ట్ కాదని, ఆ సమయానికి అలా కుదరలేదు అని చెప్పుకొచ్చారు బివిఎస్ రవి.
ఈ షోకు వచ్చిన అతిథులంతా సంతోషం వ్యక్తం చేసారని, హోస్ట్ గా వ్యవహరించిన రానా అయితే ఫెంటాస్టిక్ గా ఉందని చెప్పారని, ఏమైనా ఎడిటింగ్ చేయాలా? అని మహేష్ ని అడిగితే, ఏమి వద్దు బాగుందని చెప్పారని, రవితేజ అయితే షో ముగిసిన తర్వాత చాలా సేపు బాలకృష్ణతో ముచ్చటించి భోజనం చేసి వెళ్లారని ‘అన్ స్టాపబుల్’ షో తెరవెనుక సంగతులు వివరించారు.
TFI Supporters Of Jagan: Risked Careers, Got Cheated
You’re Good for Only Exposing: Actress Responds