Pawan Kalyan Twitter On Notes Ban And BJPజానికి వరుస క్రమంలో రెండు రోజుల క్రితమే ఈ విషయంపై పవన్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కానీ, దీనిని పక్కన పెట్టి ఏపీ ‘ప్రత్యేక హోదా’ అంశంపై తన అభిప్రాయాన్ని చెప్పిన పవన్, నేడు ‘నోట్ల రద్దు’పై తెలియజేస్తారని అంతా భావించారు. కానీ, దీనిపై తన అభిప్రాయాలు వినేందుకు మరో రోజు వేచిచూడమని ‘జనసేన’ అధినేత తాజాగా ట్వీట్ చేసారు.

పెద్ద నోట్ల రద్దుతో సహా, బంగారంపై కూడా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్తానని పవన్ ట్వీట్ చేయడంతో… మరొకసారి బిజెపిపై ‘దండయాత్ర’ ఖాయంగా కనపడుతోంది. నోట్ల రద్దు వలన సామాన్యులు అనేక మంది మరణించడంతో పాటు, గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చుని, తమ సమయాన్ని వృధా చేసుకుంటుండగా, దేశ వ్యాప్తంగా బ్యాంకుల వద్ద ఒక్క బడా బాబు కూడా లేకపోవడాన్ని పవన్ టార్గెట్ చేసుకుని ప్రకటన ఉండవచ్చన్న సంకేతాలు పొలిటికల్ వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి సర్కార్ ఎలాంటి నిర్ణయాలను వ్యక్తపరిచినా… దానిని నిలదీయడానికి పవన్ సన్నద్ధమవుతున్నట్లుగా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. లేని పక్షంలో సినిమా హాల్స్ లో జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు, బిజెపిని ఎందుకు విమర్శిస్తారన్న భావన తెరపైకి వచ్చింది. దీంతో ‘యాంటి బిజెపి స్టాండ్’ పవన్ తీసుకున్నట్లుగా, ఇదే నినాదంతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు కనపడుతున్నాయి.