pawan kalyan tweets on amma vodi schemeతొలి రెండేళ్లు వైసీపీ సర్కార్ పై నోరెత్తని ప్రతిపక్షాలు ప్రస్తుతం అధికార పార్టీ చేస్తోన్న పాలనను ఏకరువు పెడుతూ ప్రజల ముందుంచుతోంది. ముఖ్యంగా ‘ఎయిడెడ్’ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వ తీరును ఎండకడుతూ “అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడి…” పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్ కు విశేషమైన స్పందన లభిస్తోంది.

ఇటీవల ఇచ్చిన సర్కులర్ ప్రకారం 2,200 స్కూళ్లను, 2 లక్షల మంది విద్యార్ధులను, 6,700 మంది ఉపాధ్యాయులను; 182 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలను, దాదాపు 71 వేలమంది విద్యార్థులను, 116 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలను, దాదాపు రెండున్నర లక్షలమంది విద్యార్థులను ఇబ్బందులపాలు చేసిందని అన్నారు.

ముఖ్యంగా విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా, ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని, ఇందులో ఉన్న దురుద్దేశం ఏమిటని ప్రశ్నించారు? అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ ను ఎప్పుడు విడుదల చేస్తుందో చెప్పాలని, పాఠశాలలను, కళాశాలలను స్వాధీనపరుచుకోవాలన్న నిర్ణయం తీసుకునేముందు అందుకు తగిన సిబ్బందిని నియమించుకోవాలన్న కనీస ఆలోచన కూడా లేదా? అంటూ ఏకరువు పెట్టారు జనసేన అధినేత.