pawan kalyan Trivikram Srinivas movie title agnathavasi దేవుడే దిగి వచ్చినా… గోకుల కృష్ణుడు… మాధవుడు… ఇంజినీర్ బాబు… అజ్ఞాతవాసి… ఇలా ఒకటేమిటి… గత ఏడాది కాలంగా పవర్ స్టార్ అభిమానులను ఎన్నో టైటిల్స్ పలకరించాయి. ఇలా టైటిల్ పై పుకారు వచ్చిందో లేదో అలా ఫ్యాన్ మేడ్ ‘ఫస్ట్ లుక్’ పోస్టర్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యేవి. అంతలా పవన్ సినిమా కోసం ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్స్ పై నెలకొన్న గందరగోళం, ఈ దీపావళికి ఖచ్చితంగా తీరిపోబోతోందన్నది లేటెస్ట్ న్యూస్.

అవును… కొన్నాళ్లుగా ఊరిస్తూ వస్తున్న టైటిల్ ను ఈ దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అది కూడా చివరగా వినిపించిన “అజ్ఞాతవాసి” అన్న టైటిల్ కే చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. ‘దేవుడు’తో మొదలుపెట్టిన ఈ టైటిల్ చివరికి ‘అజ్ఞాతవాసి’ దగ్గర ఆగిందన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. ‘స్పైడర్’ టైటిల్ విషయంలో ఏదైతే జరిగిందో, ప్రస్తుతం పవ ‘అజ్ఞాతవాసి’ విషయంలో కూడా జరుగుతోంది. అనేక టైటిల్స్ పరిశీలన తర్వాత చివరగా వినిపించిన ‘స్పైడర్’ను ఫిక్స్ చేసిన చేసిన విషయం తెలిసిందే.

సరిగ్గా ఇదే తీరు “అజ్ఞాతవాసి” సందర్భంలో కూడా జరుగుతోంది. అయితే ఈ టైటిల్ పై క్లాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మాస్ లో మాత్రం పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. త్రివిక్రమ్ – పవన్ ల గత సినిమా “అత్తారింటికి దారేది” సినిమా టైటిల్ లో కూడా ఇదే రకమైన భావన వ్యక్తం అయినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత కధకు తగ్గట్లుగా టైటిల్ ఉండడంతో, ఆ టైటిల్ చాలా ప్లస్ పాయింట్ గా మారింది. బహుశా అదే రీతిన “అజ్ఞాతవాసి” కూడా కొనసాగుతుందేమో చూడాలి. ట్రేడ్ టాక్ ప్రకారం అభిమానులందరూ “అజ్ఞాతవాసి”కి ఫిక్స్ అయిపోవడం బెటర్.