Pawan-Kalyan-Trivikram-mythri moviesమహేష్‌ బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో ‘శ్రీమంతుడు’ సినిమాను నిర్మించి తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీస్‌ సంస్థ వారు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఎన్టీఆర్‌ సినిమాను భారీ స్థాయిలో బడ్జెట్‌ పెట్టి నిర్మించబోతున్నారు. ఇక ఈ నిర్మాతలు మరో వైపు బిగ్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా మైత్రి మూవీస్‌ నిర్మాతలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చర్చలు జరపడం జరిగిందని, పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఒక సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా వారు త్రివిక్రమ్‌తో చెప్పడం జరిగిందట.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా కోసం మైత్రి మూవీస్‌ వారు భారీ బడ్జెట్‌తో ప్రపోజల్‌ పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాను అంటూ దర్శకుడు త్రివిక్రమ్‌ వీరితో చెప్పడం జరిగింది. మరో వైపు వీరు పవన్‌తో సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఆయనకు ఇష్టం వచ్చిన దర్శకుడితో పవన్‌తో సినిమాను నిర్మించాలని కూడా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఒక్క సినిమాతోనే మైత్రి మూవీస్‌ వారు పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేయడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తోంది. మరి మైత్రి మూవీస్‌ నిర్మాతల ప్రయత్నాలు సక్సెస్‌ అయ్యేనో చూడాలి.