Pawan Kalyan Risk Supporting BJP TDP, Pawan Kalyan Speech Kakinada Risk Supporting BJP TDP Elections, Pawan Kalyan Reveals Risk Supporting BJP TDP Elections పవన్ కళ్యాణ్ “ప్రాణాలు” తీసేదెవరు? అవును… ఒక రకంగా షాకింగ్ లాంటి ప్రశ్న ఇది. గత ఎన్నికలలో స్థానికంగా తెలుగుదేశం పార్టీకి, జాతీయంగా భారతీయ జనతా పార్టీకి భుజం కాసిన ఘనత ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ది. ఇది బహిరంగమే. ఇందులో దాయడానికి ఏమీ లేదు. మరి తెరవెనుక ఏం జరిగింది? ఈ రెండు పార్టీలకు భుజం కాయడం అంటే పవన్ కు ప్రాణాలు అడ్డుపెట్టడమేనా?

నిజానికి ఇప్పటివరకు ఈ ఆలోచన ఎవరికీ రాలేదు. కానీ, కాకినాడ సభలో పవన్ ప్రసంగించిన తర్వాత అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. బిజెపి – టిడిపిలకు మద్దతు ఇచ్చిన వ్యక్తిగా ఆ రెండు పార్టీలను ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా పవన్ కు ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కూడా! ఇలా తానూ ఎందుకు అడుగుతున్నాను? అని వివరణ ఇచ్చే క్రమంలో…

“ఈ రెండు పార్టీలకు తానూ భుజం కాసాను… భుజం కాయడమేంటి… ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రచారం చేశాను…” అంటూ ఎంతో ఉద్వేగభరితంగా పవన్ చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కసారి కాదు… రెండు మూడు సార్లు పవన్ ప్రత్యేకించి ప్రస్తావించడం గమనించదగ్గ విషయం. టిడిపి, బిజెపిలకు పవన్ మద్దతు తెలపడం వెనుక ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ ను ఎవరైనా బెదిరించారా? వాటికి పవన్ లొంగలేదా? ప్రస్తుతం పవన్ అభిమానుల్లో ఇవే ప్రశ్నలు!