Pawan Kalyan ton gue slipభారీ ప్రసంగాలు చేసే రాజకీయ నేతలు ఏదొక సందర్భంలో… ‘టంగ్ స్లిప్’ అవ్వడం అనేది చాలా సహజం. ఉద్దండ రాజకీయ నేతలు సైతం, తమ తమ ప్రసంగాలలో ఒకటి, రెండు పొరపాటు వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత మళ్ళీ సరిదిద్దుకోవడం వంటివి జరిగినవే. ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోన్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ‘టంగ్ స్లిప్’కు మినహాయింపు కాడని తాజా ప్రెస్ మీట్ స్పష్టం చేసింది.

జయప్రకాష్ నారాయణ్ ను కలిసిన సందర్భంగా మీడియా మీట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్… “రాష్ట్ర విభజన హామీలపై స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రోజు పార్లమెంట్ లో ఓ ప్రకటన చేసారని” అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బహుశా ఇదే వ్యాఖ్యలు నారా లోకేష్ చేసి ఉంటే, వాటి పర్యవసానాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెటిజన్లు కూడా అదే అంటున్నారు.

రాజకీయ ప్రసంగాలలో ‘టంగ్ స్లిప్’ అనేది చాలా సర్వసాధారణంగా పేర్కొంటున్నారు. అందుకు నారా లోకేష్ ఒక్కడే ‘బ్రాండ్ అంబాసిడర్’ అన్నట్లుగా చిత్రీకరిస్తుంటారని, వెతికితే ప్రతి ఒక్కరి ప్రెస్ మీట్ లో ఏదొక మిస్టేక్ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. కొంతవరకు అందులో వాస్తవం ఉన్నా… ఇలాంటి తప్పులు పదే పదే చేయడం లోకేష్ వంతు అవుతుండగా, ఎప్పుడో ఒకసారి ‘టంగ్ స్లిప్’ కావడం ఇతర నేతల వంతవుతోంది.