Pawan Kalyan tongue slip video viral in social mediaసోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో మాట్లాడిన ఒక వీడియో హుల్ చల్ చేస్తుంది. శ్రీకాకుళం చెందిన వ్యక్తికి అమరావతిలో భూమి ఇవ్వడానికి ముఖ్యమంత్రికి మనసు రాదు గానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి మాత్రం ప్రభుత్వం ఎకరం 30 లక్షలకే భూమి ఇచ్చారని వారు 15 కోట్లకు భూమిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

అయితే ఇప్పుడు ఆ వీడియో పవన్ కళ్యాణ్ ను ఇరుకునపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది ఒక వ్యక్తి కాదు ప్రపంచంలోని టాప్ 500 కంపెనీలలో ఒకటి. దానిని విశ్వప్రయత్నం చేసి ఆంధ్రకు తీసుకొచ్చారు. అటువంటి సంస్థలకు ప్రభుత్వాలు ఒక రూపాయి నామమాత్రపు లీజ్ కు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆంధ్రలో పెట్టుబడులు రావడానికి వారికి ప్రోత్సాహాలు ఇవ్వడం తప్పనిసరి. పోనీ 30 లక్షలకు భూమి కొనడం తప్పే అనుకుంటే మరి తన సొంత ఇంటి కోసం పవన్ కళ్యాణ్ ఎకరం 20 లక్షలకే కొన్నారు కదా. అంటే అప్పుడు భూమిని అండర్ వాల్యూ రిజిస్ట్రేషన్ చేశారా? అంటే అవినీతికి పాల్పడినట్టే కదా? ఆయన 20 లక్షలకే కొన్నారు అనుకుంటే 30 లక్షలకు ఇవ్వడం తప్పు అనడమేంటి అని టీడీపీ వారు ప్రశ్నిస్తున్నారు.