‘జనసేన’ అధినేతగా రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఎలా ఉన్నా, సినీ రంగంలో మాత్రం అంతకుముందు కంటే ఎక్కువ దూకుడును ప్రదర్శిస్తున్నారు. కెరీర్ లో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా 2022లో సరికొత్త చరిత్రను సృష్టించడానికి పవర్ స్టార్ సిద్ధమవ్వడం అభిమానులకు ఆనందదాయకమైన అంశం.

అవును… 2022లో పవన్ కళ్యాణ్ నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయనే సమాచారం ఫ్యాన్స్ ను ఒక రకంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిజమే… కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క ఏడాదిలో రెండు సినిమాలు కూడా విడుదల చేయలేని పవన్ కళ్యాణ్ 2022లో మాత్రం ఏకంగా మూడింటిని లైన్ లో పెట్టడం సినీ కెరీర్ పరంగా మంచి విషయమే.

Also Read – సజ్జలని బహిరంగంగా అలా మాట్లాడొద్దని ఎవరైనా చెప్పండర్రా!

ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం జనవరి 12వ తేదీన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ ఉండగా, ఇది కాస్త అటు ఇటుగా అయినా జనవరి 26వ తేదీ ప్రత్యామ్నాయంగా ఉంది. ఇక క్రిష్ దర్శకత్వంలో నటిస్తోన్న “హరి హర వీరమల్లు” సినిమా సమ్మర్ కు సిద్ధమవుతోంది. నిజానికి 2022 సంక్రాంతికే ఈ సినిమా రెడీ అవుతుందని భావించారు గానీ, కరోనాతో తలెత్తిన పరిస్థితులతో వేసవి వినోదానికి రెడీ అవుతోంది.

మూడవ సినిమాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “భవదీయుడు భగత్ సింగ్” వచ్చే ఏడాది దసరా నాటికి సిద్ధమవుతుందనేది లేటెస్ట్ న్యూస్. నిర్ణయించుకున్న షెడ్యూల్స్ అన్ని పక్కాగా జరిగితే వచ్చే ఏడాది పవర్ స్టార్ మూడు సార్లు సిల్వర్ స్క్రీన్ ను పలకరించడం తధ్యం! ఈ క్రేజ్ ను పవన్ తన పొలిటికల్ కెరీర్ కు ఎలా వినియోగించుకుంటారో చూడాలి.

Also Read – సెకండ్ హాఫ్ లో టాలీవుడ్ దే హవా!