Pawan Kalyan  -Telangana Elections 2018తెలంగాణాలో నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 12 నుంచి మొదలవుతుంది. 19 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు ఖరారైన 107 మంది అభ్యర్థులకు రేపు సీఎం కేసీఆర్ బి-ఫారంలు ఇవ్వబోతున్నారు. వారి వారి మంచి రోజులను బట్టి నామినేషన్లు వేసుకుంటారు. ఈ నెల 15న గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

మరోవైపు నేడో రేపో మహాకూటమి పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా సమాలోచనలు జరుపుతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ముందస్తు ఎన్నికలు రావడం, సన్నద్ధత లేకపోవడంపై పోటీపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు.

ముందస్తు కాకుండా వచ్చే ఏడాదే ఎన్నికలు వస్తే 23 స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా అనుకున్నామని.. అలాగే మూడు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయాలని భావించామని పేర్కొన్నారు. ముందస్తుకు వెళ్లడంతో తమ పార్టీ పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొందని వివరించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే 23 స్థానాలలో మాత్రమే పోటీ చేసేటట్టు అయితే ఇప్పుడు ఇంక దాని గురించి సమాలోచనలు ఎందుకు?