Pawan Kalyan supports TRSజనసేన – బీజేపీ పొత్తు కలహాల కాపురంలా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు వారిద్దరి మధ్య చిచ్చు రేపుతున్నాయి. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్థి… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి దేవి గెలిచారు. బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటు తెరాస పరమైపోయింది.

ఎన్నికల రోజు తెలంగాణ బీజేపీ నాయకులు తమను పదే పదే అవమానిస్తున్నారు అంటూ పవన్ వాణి దేవికి మద్దతు ప్రకటించారు. దానికరణంగానే ఓడిపోయారు అంటూ జనసైనికులు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే దీనికి ప్రతిగా బీజేపీ సమర్ధకులు పవన్ కళ్యాణ్ మీద హీనమైన ప్రచారానికి ఒడిగట్టడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ తెరాసకు అమ్ముడుపోయాడని, ముఖ్యంగా వకీల్ సాబ్ స్పెషల్ షోలు, టిక్కెట్ రేట్ల పెంపు వంటి వాటికోసం కేసీఆర్ తో లాలూచి పడ్డారని ప్రచారం మొదలుపెట్టారు. దీనితో ఇరువర్గాల వారు దూషణలకు దిగారు. అయితే పొత్తులో ఉన్నంత కాలం జనసేనను అవమానించి వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానికి నిందించడం బీజేపీకి తగదు.

జనసేనకు తగిన గౌరవం ఇవ్వం… పోటీ చేసే అవకాశం ఇవ్వం… అయినా మేము చెప్పినట్టు నడవాలి అంటే కుదరదు. ఈ వైఖరి కొనసాగితే మునుముందు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా నష్టమే. ఇకపోతే వచ్చే నాగార్జునసాగర్ ఉపఎన్నికలోను, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలోనూ జనసేన పోటీ చెయ్యబోతున్నట్టు సమాచారం.