pawan kalyan strong reply to ys jaganఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మిగులుండగానే జగన్ రాష్ట్రంలో తన మాటలతో రాజకీయ కాక రేపుతున్నారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు కూడా బదులు చెప్పని జగన్ ఇప్పుడు బహిరంగ సభలంటూ హడావిడి చేస్తూ విపక్ష నేతలపై ఘాటు వ్యాఖ్యలు., వివాదాస్పదమైన దూషణలు చేయడం చూస్తుంటే జగన్ లో ‘హస్తిన’ పర్యటన తరువాత ఆగ్రహం.,అసహనం., నిస్సహాయత తాండవిస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.

రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పవన్,చంద్రబాబు ప్రభుత్వాన్ని పాలనా పరమైన విధానాలపై నిలదీస్తున్నారు. పవన్ కూడా రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలను గురించి., ప్రభుత్వం విధిస్తున్న కరెంట్ కోతల గురించి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతుల ఆత్మహత్యలకు నిరసనగా ‘రైతు భరోసా యాత్ర’ను ప్రారంభిస్తాను అన్న పవన్ ప్రకటనతో “యాత్ర”ల ప్రభావం ఏంటో రుచి చూసిన జగన్ ఆవేశానికి లోనవుతున్నారు జనసైనికులు వాపోతున్నారు.

విపక్షాల ‘ముప్పేట దాడిని’ సహించలేకనో.,కేంద్ర పెద్దలతో అనుకున్న పని జరగకో కానీ జగన్ ‘అసహనంతో’ రగిలిపోతున్నారని దాని పర్యవసానమే ఈ వ్యక్తిగత దాడులు అంటున్నారు జనసేన నేతలు.జనసేనాని పవన్ కూడా ఈ వ్యాఖ్యల పై స్పందించారు. మేము వ్యవస్థల పని తీరు గురించి ప్రశ్నిస్తే మీరు దుర్మార్గుడు., మారీచుడు.,దత్తపుత్రుడు అంటూ వ్యక్తిగత దాడులకు దిగితే ఎలా ముఖ్యమంత్రిగారు..! అంటూ తన సమాధానాన్ని జగన్ కు పంపించారు.

మీరు స్థాయి దిగితే నేను కూడా అదే స్థాయికి వచ్చి మాట్లాడగలనని.,మీరు మీ ప్రవర్తనను మార్చుకోక పొతే ఎప్పుడు., ఎక్కడ., ఎలా మీకు సమాధానం చెప్పాలో నాకు తెలుసునని జగన్ కు తనదైన శైలిలో పవన్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.