jana-sena-pawan-kalyan-tdpజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసి సర్వత్రా దుమారం రేపారు. దీనిపై అభిమానులు భగ్గుమంటున్నారు. జనసేన పార్టీ తాము ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నామని అభిమానులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల వెనుక టీడీపీ ఉందేమో అని అభిమానుల అనుమానం. అయితే ఈ వివాదంపై జనసేన మిత్రపక్షాలు గా ఉన్న వామపక్ష పార్టీల నేతలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అభిమానులకి అంతు చిక్కడం లేదు.

శ్రీరెడ్డికి బాసటగా నిలుస్తున్న సంధ్య వామపక్ష అనుబంధ సంస్థ సభ్యురాలు. గతంలో వామపక్ష నేతల తో కలిసి ఆమె ఎన్నో పోరాటాలు చెయ్యడం అందరికి తెలిసిందే. ఆమెతో వారు మాట్లాడి పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న అనవసర రాద్ధాంతాన్ని ఆపుచేయవచ్చు. అయితే అటువంటి ప్రయత్నం ఏమి జరగడం లేదు. పవన్ కళ్యాణ్ ను కేవలం తమ రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారు అనే అపప్రద వామపక్షాలకు వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. మరోవైపు ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది జనసేనకు అంతుపట్టకుండా ఉంది.

దీనిని వెంటనే రంగంలోకి దిగి ఖండించాలని అభిమానులు భావిస్తుండగా అలా స్పందిస్తే ఆమెకు ఆమె చేస్తున్న చీప్ విమర్శలకు ప్రచారం కలిపించినట్టే అని ఇంకో వర్గం భావిస్తున్నారు. అయితే ఇలాంటి నీతి బాహ్యమైన విమర్శల వల్ల పవన్ కళ్యాణ్ కు ప్రజాలలో సానుభూతి వస్తుందే తప్ప జరిగే నష్టం పెద్దగా లేదనే చెప్పుకోవాలి. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి వాడిన అసభ్యపదజాలం ఆమెకు కచ్చితంగా చేటు చేసేవే తప్ప ఆమెకుగానీ ఆమె పోరాటానికి గాని ఎటువంటి ఉపయోగం లేకపోగా మరింతగా చేటు చేసేవిగా ఉన్నవి.