Pawan-Kalyan---Sri-Reddyటీవీ స్టూడియోల్లో కూర్చుని తమకు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెడితే ఉపయోగం ఉండదని, పోలీస్ స్టేషన్, కోర్టులకు వెళ్లి ఫిర్యాదులు చేయాలని ‘కాస్టింగ్ కౌచ్’పై పోరాటం చేస్తోన్న శ్రీరెడ్డికి సూచనలు చేసిన పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. తొలుత పవన్ ప్రకటనను స్వాగతించి, కనీసం స్పందించినందుకు సంతోషమని, పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేసింది.

తాజాగా ఫేస్ బుక్ లో మరో పోస్ట్ పెడుతూ… “”పీకేజీ… ఆంధ్రా కోసం మీరెందుకు నిరసనలు తెలియజేస్తున్నారు? హోదా కోసం పోలీసు స్టేషన్ కో, కోర్టుకో వెళ్లవచ్చుకదా. మేము కూడా మీలానే! తెలుగు అమ్మాయిల స్వాతంత్రం కోసం, కాస్టింగ్ కౌచ్ నిర్మూలన కోసం కోసం పోరాడుతున్న వారిపై కనీస గౌరవం కూడా మీకు లేదా? అమ్మాయిలు ఎవరూ పీకేల సపోర్టు కోరుకోవడం లేదు. మీరేమీ బలవంతంగా నోరు తెరచి మాట్లాడక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఇది సిగ్గు చేటు” అంటూ పేర్కొంది.

సాధారణంగా పవన్ ఇలాంటి విషయాలపై స్పందించరు, కానీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో తన భావాన్ని వ్యక్తపరిచారు. పవన్ చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉందో, శ్రీరెడ్డి వేసిన కౌంటర్ లోనూ అంతే లాజిక్ కూడా ఉందని చెప్పవచ్చు. తన పోరాటానికి చేయూత అందించే వారి సలహాలు తప్ప, ప్రస్తుతం ఇతరుల సూచనలను, సలహాలను తీసుకునే స్థితిలో శ్రీరెడ్డి లేదని ఈ సందర్భంగా స్పష్టమవుతోంది.