Sri-Reddy-Worked-in-Sakshi-for-2.5-Yearsటాలీవుడ్ లో శ్రీరెడ్డి వివాదం ముదురుతోంది. ఇప్పటిదాకా చాలా మంది ప్రముఖులను టార్గెట్ చేసిన ఆమె తాజాగా నిన్న పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలకు దారితీసుకున్నారు. ఆమె వాడిన పదజాలం నీతిబాహ్యంగాను రాయలేనిది గాను ఉందనడంలోను ఎలాంటి సందేహం లేదు. అయితే ఆమెను రెచ్చగొట్టడంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ పాత్ర కూడా ఉంది. శ్రీరెడ్డి స్పెషల్ స్టేటస్ గురించి పవన్ కళ్యాణ్ కోర్టుకు వెళ్ళొచ్చుగా అన్నదానిపై ఫాన్స్ ఆమె పై ముప్పేట దాడికి దిగారు. అయినను ఆమె వాడిన భాష ఎవరికీ ఆమోదయోగ్యం కాదు.

మరోవైపు శ్రీరెడ్డి వెనుక తెలుగుదేశం పార్టీ వుండి నడిపిస్తుంది అని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆరోపణ అనుమానం. నిజానికి ఆమెకు ఈరోజు మద్దత్తు ఇస్తుంది వామపక్ష అనుబంధ సంఘాల ప్రతినిధులైన సంధ్య వంటి వారు. వామపక్షాలు అంటే ప్రస్తుతం జనసేన మిత్రపక్షాలే కదా. అయిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య టీడీపీకి వ్యతిరేకంగా గళం విప్పాడు కాబట్టి సహజంగా ఇది రాజకీయ దాడిగా భావిస్తున్నారు. ఈ ఊహాగానాలను పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇవ్వడాన్ని తొలినుండి వ్యతిరేకిస్తున్న ఒక వర్గం ప్రోత్సహిస్తుంది.

వారు మొదటినుండి పవన్ కళ్యాణ్ ను టీడీపీ వాడుకుని వదిలేస్తుంది అని భావించిన వారే. మా అనుమానమే నిజమైంది వారు ఇప్పుడు మిగతా వారిని కూడా ప్రభావితం చేస్తున్నారు. ఇదే అదనుగా వైఎస్సార్ పార్టీ వారు కూడా వారికి జాతకలిసి వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ అభిమానులును ఎగదోస్తున్నారు. మరోవైపు జనసేన కూడా తాము దీనిని రాజకీయ కుట్ర లాగే చూస్తున్నాం అని ప్రకటించింది. దీనితో అభిమానుల అనుమానం అంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉంది. లోగుట్టు పెరుమాళ్ కెఱుక.

మరోవైపు ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది జనసేనకు అంతుపట్టకుండా ఉంది. దీనిని వెంటనే రంగంలోకి దిగి ఖండించాలని అభిమానులు భవిస్తుండగా అలా స్పందిస్తే ఆమెకు ఆమె చేస్తున్న చీప్ విమర్శలకు ప్రచారం కలిపించినట్టే అని ఇంకో వర్గం భావిస్తున్నారు. అయితే వదిలేస్తే జరిగే పరిణామాలు తేలికగా ఉండవని ప్రజారాజ్యం అనుభవాలు చెబుతున్నాయి. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏం నిర్ణయిస్తారు అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి వాడిన అసభ్యపదజాలం ఆమెకు కచ్చితంగా చేటు చేసేవే తప్ప ఆమెకుగానీ ఆమె పోరాటానికి గాని ఎటువంటి ఉపయోగం లేకపోగా మరింతగా చేటు చేసేవిగా ఉన్నవి. వీటిని సభ్యసమాజం ఖండించాలి.