Pawan kalyan singing for Sardaar gabbar Singhపవన్ కళ్యాణ్ కు నటించడం ఎంత ఇష్టమో చెప్పడం కొంచెం కష్టమే గానీ, పాటలను పాడటం మాత్రం అమితంగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు కూడా! అదును చిక్కినప్పుడల్లా తన గాత్ర మాధుర్యాన్ని తన సినిమాలలో ఏదొక సమయంలో, ఏదొక సందర్భంలో వినిపించడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పరిపాటిగా మారింది.

ముఖ్యంగా “అత్తారింటికి దారేది” సినిమాలో పవన్ పాడిన ‘కాటం రాయుడా… కదిరి నరసింహుడా…’ పాట ఏ రేంజ్ లో మోత మోగించిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే తన లేటెస్ట్ సెన్సేషన్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాలో పవన్ ‘పోతురాజు… పోతురాజు…’ అనే పాటను ఆలపించినట్లుగా తెలుస్తోంది.

తాజా సమాచారంతో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ పాటల వేడుక కోసం అభిమానులు మరింత రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. దేవిశ్రీ సంగీతం వహించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ పాట పాడడం… ఆ సినిమా అప్పట్లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టడం తెలిసినదే. దీంతో ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే మళ్ళీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.