pawan kalyan silent on andhra pradesh special statusజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం గట్టిగా మాట్లాడేవారు. ప్రత్యేక ప్యాకేజీ ని రెండు పాచి పోయిన లడ్డులతో పోల్చేవారు ఆయన. అయితే ఎన్నికల తరువాత ఆయన మాట మార్చి బీజేపీ పంచన చేరారు. అయితే ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం ప్రజలకు కూడా లేకపోవడం, అన్ని పార్టీలు దానిని పక్కన పెట్టడంతో ఆ విషయం తెరమరుగు అయిపోయింది.

అయితే ఇప్పుడు కేంద్రం దోషిగా ఇంకో విషయం తెర మీదకు వచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎందరో ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తుంది కేంద్రం. దీనిపై విశాఖవాసులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. టీడీపీ, వామపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ కనీసం ఉద్యమం చేసినట్టుగా నటిస్తుంది. అయితే ఈ విషయం పై జనసేన సైలెంట్ గా ఉండటం గమనార్హం. ఈ అంశంపై తమ నిర్ణయం పునఃసమీక్షించుకోవాలని పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసి వచ్చారు. ఆ తరువాత అసలు అటువంటి అంశమే లేనట్టు మిన్నకుండిపోయారు.

గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశం మరింతగా ఉదృతం అవ్వడం ఖాయం. ఇప్పటికైనా పవన్ ఈ అంశం మీద గట్టిగా మాట్లాడకుండా బీజేపీతో తమ పొత్తుకే ఎక్కువ విలువనిస్తే పవన్ విశ్వసనీయత మీదే అనుమానాలు మొదలు అవుతాయి.