చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి వరదలతో కేరళ అతలాకుతలం అవుతుంది. దీనితో ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అన్ని వర్గాలవారు ముందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నగదు వస్తు రూపేణ 50 కోట్లు దాకా అందించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఒక నెల జీతం ప్రకటించారు.
మరోవైపు ప్రతిపక్ష వైకాపా పార్టీ తన వంతుగా కోటి రూపాయిలు ప్రకటించింది. అటు తెలంగాణలో తెరాస 25 కోట్లు నగదు ప్రకటించి, వస్తు రూపంలో కూడా సాయం చేసింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీదే ఉంది. పవన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు.
సినీ రంగం నుండి విరివిగా విరాళాలు వచ్చాయి. మెగా హీరోలు కూడా ముందు ఉండి పెద్ద అమౌంట్లే ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని అభిమానులు వేచి చూస్తున్నారు. వరదల వల్ల ఇప్పటికే 20000 కోట్ల వరకు నష్టం ఉండవచ్చని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. 350 మంది దాకా మరణించారు.