Pawan Kalyan Supports BJP in Karanata ka issueకర్ణాటక ఎన్నికల తంతు ముగిసింది. టీడీపీ, కొన్ని తెలుగు సంఘాలు ప్రతిఘటించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే సాధారణ మెజారిటీకి కూతవేటు దూరంలో ఆగిపోయి ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలుకు సిద్ధం అవుతుంది. గవర్నర్ ఆరెస్సెస్ వాది కావడంతో సంఖ్యాబలం లేకున్నా బీజేపీకే అవకాశం ఇచ్చారు.

యడ్యూరప్ప వారం గడువు అడిగితే గవర్నర్ 15 రోజుల టైం ఇచ్చి తన స్వామి భక్తి చాటుకున్నారు. దీనిని దేశంలో ఉన్న అన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలు ఖండిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం ఎందుకో తప్పును తప్పు అని ఖండించలేకపోతుంది. ఈరోజు ఒక టీవీ కార్యక్రమంలో జనసేన ప్రతినిధి శ్రీదర్ దీని పై వ్యాఖ్యానించలేదు.

టీడీపీ, వైకాపా, కాంగ్రెస్ పార్టీలు వారికి కావాల్సిన విధంగా గవర్నర్ నిర్ణయాన్ని అన్వయించుకుంటున్నారు అని చెప్పి ఊరుకున్నారు గానీ టీవీ వ్యాఖ్యాత ఎన్ని సార్లు అడిగినా జరిగింది తప్పా ఒప్పా అని మాత్రం చెప్పలేదు. ఎన్ని సార్లు రేటించిన వేరే పార్టీలను తిడుతూ సమయం గడిపేశారు. దీనిబట్టి పవన్ కళ్యాణ్ మోడీ తొత్తు అని రుజువు అయ్యిందని టీడీపీ ఆరోపించింది.