Pawan Kalyan short of security for porata yatraశ్రీకాకుళం జిల్లా నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించిన పోరాట యాత్రకు గురువారం పవన్‌కల్యాణ్‌ విరామం ప్రకటించారు. పవన్‌కు కనీస పోలీసు భద్రత కల్పించలేదని, సొంత భద్రతా సిబ్బందితోనే ఆయన పర్యటన కొనసాగిస్తున్నారని జనసేన పేర్కొంది. పవన్‌ పర్యటనలో 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డరని పార్టీ తెలిపింది.

కొత్త సిబ్బంది శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉన్నందున రేపటి యాత్రకు విరామం ప్రకటిస్తున్నట్టు వివరించింది. అయితే ఇటువంటి ఆరోపణ చంద్రబాబు ప్రభుత్వం మొట్టమొదటి సారి. గత కొన్ని నెలలుగా పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి కూడా ఇటువంటి ఆరోపణ చెయ్యలేదు. మొన్న అయితే ఏకంగా తనపై దాడి చెయ్యడానికి ముఖ్యమంత్రి కిరాయిగూండాలను పంపించారు అని అభియోగించారు.

40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు రౌడీ రాజకీయాన్ని గానీ కక్షపూరిత రాజకీయాలు గానీ చేసింది లేదు. ఈ విషయం ఆయన ప్రత్యర్ధులు కూడా ఒప్పుకుంటారు. ఒకవైపు చంద్రబాబు గానీ లోకేష్ గానీ పవన్ కళ్యాణ్ ను గట్టిగా విమర్శించే ప్రయత్నమే చేసిందిలేదు. ఆయనను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారంటే నమ్మడం కష్టమే.