Sardaar Gabbar Singh Hindi Teaserపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి బాలీవుడ్ మూవీ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా తొలి టీజర్ విడుదలైంది. టైటిల్ సాంగ్ తో విడుదలైన ఈ టీజర్ హిందీ లిరిక్స్ ఏమీ లేవు గానీ, ‘గబ్బర్ సింగ్’ ఫేమస్ డైలాగ్ ‘జో డర్ గయా… ఓ మర్ గయా…’ అనే డైలాగ్ తో ఆరంభమై, ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఈజ్ బ్యాక్ అనే పదాలతో ముగుస్తుంది. హిందీ వెర్షన్ అన్న మాటే గానీ, ఒకే మ్యూజిక్ తో రెండు టీజర్లు కట్ చేసినట్లుగా స్పష్టమవుతోంది.

అయితే ఈ రోజు ఉదయం విడుదలైన తెలుగు టీజర్ లో లేని షాట్స్ ఈ హిందీ టీజర్ లో చూపించడంతో ‘తెలుగు ఆడియన్స్ పై ఈ వివక్ష ఏలా…’ అంటున్నారు నెటిజన్లు సరదాగా! ముఖ్యంగా పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఈ షాట్స్ ను కట్ చేసారు. పవన్ లో మునుపటి తేజస్సు తాండవిస్తుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీలో మునిగి తేలుతున్నారు. ‘బాహుబలి’ మాదిరి తెలుగు, హిందీ భాషలలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ కూడా రికార్డులు సృష్టిస్తుందనే అంచనాతో అభిమానులు ఉన్నారు.