Pawan Kalyan Role in RGV KAMMA RAJYAMLO KADAPA REDDLU movieరామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు తెలుగు సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు. శివ సినిమా అప్పుడొక సెన్సేషన్. అటువంటి సినిమాలు ఎన్నో. ఈరోజు ఉన్న అగ్రదర్శకులు ఎందరో ఆయన నుండి ప్రేరణ పొందారు అని చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అప్పటి రామ్ గోపాల్ వర్మ కు ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలకు అసలు సంబంధమే లేదు.

వివాదస్పద సబ్జెక్టులు తీసుకుని వాటి మీద సినిమాలు తీయడం, ఆడియన్స్ నోళ్ళలో నానడం, టీవీలలో ఉచితంగా పబ్లిసిటీ తెచ్చుకోవడం రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య చేస్తున్నా పని. అయితే సినిమాలు ఆడుతున్నాయా అంటే అది కూడా లేదు. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేసే అవకాశం ఇవ్వలేదని కోపం తో ఆయన లక్ష్మి పార్వతి సెంటర్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశారు.

తద్వారా టీడీపీకి వ్యతిరేకంగా, వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా వర్మ పని చేసినట్టుగా అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు జగన్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బాగా ఖుషీ చేశారు. తమలోని సినీ వైరం, రాజకీయ వైరాన్ని కలిపి సోషల్ మీడియాలో తమ అక్కసు తీర్చుకునే వారు. రాము దమ్మున్న నిర్మాత అని, సరైన బయోపిక్ తీయాలంటే ఆయనే అని కీర్తించేశారు.

ఇప్పుడు రాము కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే మరో రాజకీయ సంబంధమైన సినిమా తీస్తున్నారు. టీడీపీపై వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు గురించి అని క్లియర్ గానే అర్ధం అవుతుంది. దీనిలో జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంటుంది. ఈ చిత్రం ట్రైలర్ ఈనెల 27న దీపావళి సందర్భంగా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా ఒక ఫోటో విడుదల చేశారు.

ఆ ఫొటోలో పవన్ కళ్యాణ్ గెట్ అప్ లో ఉన్న వ్యక్తి చుట్టూ అమ్మాయిలు ఉన్నారు. ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే ఎంజాయ్ చేసిన మెగా అభిమానులు ఖంగుతిన్నారు. యధావిధిగా రాముని బూతులు తిడుతున్నారు. అయితే ఇది స్వయంకృతాపరాధమే కదా