రాజధాని ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సంచలనాత్మక ప్రకటనతో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. “2014 ఎన్నికల్లో 60-70 స్థానాలకు పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పాను. విడి విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని చంద్రబాబు అన్నారు.ఎన్నికల తర్వాత రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు,” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం చంద్రబాబుకు మద్దత్తు ఇచ్చానని, ఎలాంటి కండిషన్లు పెట్టకుండా ఓట్లు చీలిపోకూడదు అనే ఉద్దేశంతో బేషరతుగా మద్దత్తు ఇచ్చానని, ఈ క్రమంలో తనకు అన్నీ అయిన అన్నయ్యతో కూడా విభేదించానని చెప్పుకొచ్చారు. చాలా మంది దీనిని నమ్మి పవన్ కళ్యాణ్ ను అభిమానించారు కూడా.
అయితే ఇప్పుడు పవన్ కల్యాణే స్వయంగా బేరసారాలు జరిపి 2014 ఎన్నికలలో పోటీ చెయ్యలేదని ఒప్పుకున్నారు. ఇప్పుడు రాజ్య సభ సీట్లు ఇవ్వని కారణంగానే చంద్రబాబును విమర్శిస్తున్న అని ఆయన చెప్పకనే చెప్పారు. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ వేసుకున్న అతి పెద్ద సెల్ఫ్ గోల్ అనే అనుకోవాలి.