pawan-kalyan-responded-first-time-on-baahubaliతెలుగు సినీ ప్రపంచంలో అద్భుతమైన, అమోఘమైన రికార్డులకు నిలయం “బాహుబలి.” ఈ సినిమాపై దాదాపుగా అందరూ హీరోలు వివిధ సందర్భాలలో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు… ఒక్క పవన్ కళ్యాణ్ మినహా! అయితే ఇపుడు ఆ లోటు కూడా తీరిపోయింది. శనివారం నాడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సందర్భంగా తొలిసారిగా పవన్ నోట “బాహుబలి” మాట వచ్చింది.

‘బాహుబలి’ని మించిన స్థాయిలో ఉంటే తప్ప తన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ను హిందీలో విడుదల చేయవద్దని, ఒకవేళ విడుదల చేస్తే అనవసరంగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని… ఆ పని చేయవద్దూ అంటూ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసిన సూచనలపై స్పందించిన పవన్…. ‘వర్మ అభిప్రాయాలకు తానూ గౌరవమిస్తానని, అయితే తానూ ‘బాహుబలి’ రికార్డులను కొట్టడానికి హిందీలో విడుదల చేయడం లేదని, ఈ కధ హిందీకి కూడా సరిపోతుందనే ఉద్దేశంలో విడుదల చేస్తున్నామని’ పవన్ స్పష్టత ఇచ్చారు.

‘సర్ధార్ గబ్బర్ సింగ్’కు ఎంత కెపాసిటీ ఉంటే అంతే ఆడుతుందని, ఇతర చిత్రాలతో పోటీపడే భావన తమకు లేదని, సినిమాలకు కేవలం ఎంటర్టైన్మెంట్ కోణంలో చూడాలి తప్ప, రాజకీయ కోణంలో కాదని, ఈరోస్ సంస్థ హిందీలో విడుదల చేస్తోందని… ‘సర్ధార్’ విడుదల తేదీ విషయంలో మార్పు లేదని, ఏప్రిల్ 8వ తేదీనే విడుదల కానుందని ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు పిచ్చ హ్యాపీ.