Pawan Kalyan remembers chanting hanuman chalisa at his teenageచాలా కాలం క్రితం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను చదువులో చాలా పేలవంగా ఉండేవాడినని, అయితే పుస్తకాలు తన తోడుగా మారాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పవన్ వేలాది పుస్తకాలు చదివాడు, ఇప్పటికీ చెడుబుతున్నారు కూడా. ఇప్పుడు, పవన్ కళ్యాణ్ తన టీనేజ్ నాటి మరొక విషయాన్నీ అభిమానులతో వెల్లడించాడు.

యుక్తవయసులో ఆయన కొన్ని రోజులలో హనుమాన్ చలిసాను పఠించేవారట. ఆయన మరియు ఆయన కుటుంబం హనుమంతుడిని ఎలా ఆరాధించారో ఆయన వెల్లడించారు. “హనుమంతుడి ఆరాధన నా సోదరుడు-చిరంజీవి గారు ద్వారా మా ఇంటికి వచ్చింది. మా తండ్రి గారు నాస్తికుడు & కమ్యూనిస్ట్ నుండి రాముడు భక్తుడిగా రూపాంతరం చెందారు. నా టీనేజ్ వయస్సులో కొన్ని రోజుల్లో నేను చాలిసాను 108 సార్లు పఠించేవాడిని. జై హనుమాన్, ”అని ట్వీట్ చేశాడు.

హనుమాన్ జయంతి గురించి తన సోదరుడు చిరంజీవి చేసిన ట్వీట్‌కు సమాధానమిస్తూ ఆయన పంచుకున్న విశేషాలు ఇవి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు బ్యాలన్స్ చేసే పనిలో ఉన్నారు. 2018లో సినిమాలకు స్వస్తి చెప్పినా, మొన్న ఈ మధ్య తిరిగి వచ్చి రెండు సినిమాలు తెరకెక్కించారు.

అందులో మొదటి చిత్రం, వకీల్ సాబ్ వచ్చే నెల 15న విడుదల కావాల్సి ఉంది. అయితే లొక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దీనితో వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు ఆయన క్రిష్ తో ఒక పీరియడ్ సినిమా కూడా చేస్తున్నారు. అది 2021 మొదటి భాగంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.