pawan-kalyan-tvp-ravi-prakash‘ప్రత్యేక హోదా’ను పవన్ కళ్యాణ్ వదిలిపెట్టేసారా? నిజానికి ఈ ప్రశ్న కాకినాడ సభ ముగియగానే అందరి మదిలో తలెత్తింది. అయితే అర్ధంతరంగా ముగిసిన ఆ సభ తర్వాత, తాజాగా ఓ మీడియా అధినేతతో పవన్ తన భావాలను పంచుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూసిన తర్వాత కూడా అందరి మదిలో కలిగే ప్రశ్న… ‘ప్రత్యేక హోదా’ను పవన్ కళ్యాణ్ వదిలిపెట్టేసారా? అని! అవును… ముందు ‘క్షమాపణ’ చెప్పండి… ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంటూ పవన్ స్పష్టత ఇచ్చారు.

రాష్ట్రం ‘ప్రత్యేక ప్యాకేజ్’కు కమిట్ అయినపుడు ఈ రెండున్నర్ర సంవత్సరాలు ఎందుకు వేచిచూసారు? అప్పుడే ప్యాకేజ్ తీసుకుని ఉంటే, ఇప్పటికి కాస్తైనా అభివృద్ధి జరిగేది కదా..! అది కాక, ‘ప్రత్యేక హోదా’ అంటూ ఎందుకు ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టారు? అప్పుడే ప్రత్యేక ప్యాకేజ్ గురించి చెప్పి ఉండాల్సింది కదా..! ఇప్పుడేమో ప్యాకేజ్ అనే వీరంతా రేపు ఎన్నికల సమయంలో… ఎందుకు అభివృద్ధి జరగలేదు అంటే… స్పెషల్ స్టేటస్ రాలేదని, కేంద్రం అనుకున్నంత నిధులు ఇవ్వలేదని అంటారని… తెలుగుదేశం పార్టీ వైఖరిని మొదటిసారిగా విభేదించారు.

భవిష్యత్తు గురించి తనకు పూర్తి స్పష్టత ఉందని, ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసని, కేంద్రం ఎలా స్పందిస్తుందో అన్న విషయంపై వేచిచూస్తున్నానని, ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇవ్వమని ముందుకు వెళితే… అది సీమాంధ్రకు వచ్చి చెప్పాలని, అలాగే మోసం చేసినందుకు గానూ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని, ఇందులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామంటేనే తానూ వాళ్ళ తరపున ప్రచారం చేసానని, అందుకే ఇపుడు అడుగుతున్నానని అన్నారు.

ఓట్లు అడగడానికి వచ్చినపుడు సీమాంధ్రకు వచ్చి అడుగుతారా..? ప్యాకేజ్ లేమో టీవీల నుండి ప్రకటన చేస్తారా..? అవే మాటలు వచ్చి సీమాంధ్రలో చెప్పండి… అప్పుడు ప్రజల రియాక్షన్ చూడండి… అంటూ బిజెపి నేతలను సూటిగా ప్రశ్నించారు. కాకినాడ సభలో పవన్ అసంపూర్తిగా వదిలేసిన అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాయి గానీ, ఎందులోనూ పస లేకపోవడం నిరుత్సాహానికి గురి చేసే అంశం.