Pawan Kalyan Rana Daggubati Bheemla nayak Movieమొదటినుంచి భీమానాయక్ విషయంలో అంచనాలు తారాస్థాయి లోనే ఉన్నాయి. ఆల్రెడీ మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియం మూవీకి రీమేక్ కావడంతోపాటు.. ఇందులో లో పవన్, రానా నటిస్తుండడంతో తో విపరీతమైన హైప్ వచ్చేసింది. పాటలు, పోస్టర్లు, టీజర్లతో మూవీకి కావాల్సినంత బజ్ తీసుకువచ్చింది మూవీ టీమ్.

ఇక‌ ట్రైలర్ రాక‌తో అంచనాలు మరింతగా పెరిగాయి. అందరూ ఊహించినట్టుగానే సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాయి. మలయాళంలో వర్కవుట్ అయిన రియలస్టిక్ స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాగా ఈ మూవీకి కలెక్షన్స్ పరంగా బాగానే వర్కౌట్ అయింది. భీమానాయక్ మొదటి వీకెండ్ పూర్తయిపోయింది.

రెండో వారంలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించాలని మూవీమేకర్స్ ప్లాన్ వేస్తున్నారని చర్చలు సాగుతున్నాయి. వారి ప్లాన్ లో భాగంగా సినిమా లో కట్ చేసిన కొన్ని సన్నివేశాలను, మొదట్లో యూట్యూబ్ ను ఊపేసిన అంత ఇష్టం ఏందయ్యా సాంగ్ ను ఆడ్ చేస్తారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.

అయితే మిర్చి 9 ప్రతినిధులు ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాగర్ కే చంద్రను ఈ సాంగ్ విషయం అడిగారు. డైరెక్టర్ స్పందిస్తూ అసలు ఆ సాంగ్ ని షూట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం రికార్డు మాత్రమే చేశామని, ఆ తర్వాత ఆ సాంగ్ ఈ కథకు వర్కౌట్ కాదని షూటింగ్ చేయలేదని స్పష్టం చేశారు. అంటే ఆ సాంగ్ ఈ సినిమాలో ఉండే అవకాశం లేదన్నమాట. ఇది పవన్ అభిమానులకు పెద్ద నిరాశ అని చెప్పుకోవాలి. కాకపోతే ఆ సాంగ్ మాత్రం పెద్ద హిట్ అయింది.

ఇక గడిచిన మూడు రోజుల్లో భీమానాయక్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే వంద కోట్ల మార్క్ ను కూడా క్రాస్ చేసింది. మరి రెండో వారంలో మరిన్ని సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. అవి గనక సూపర్ హిట్ అయితే మాత్రం పవన్ సినిమాకు పోటీ తప్పదు. రెండో వారంలో భీమానాయక్ పరిస్థితి ఆ సినిమాల పైనే ఆధారపడి ఉంది.