Pawan Kalyan _ Rana Daggubatiతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లు సహజంగా ఇమేజ్ అనే చట్రంలో ఉండిపోయి బయటకు రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ కిడ్స్ కు అయితే ఈ ఇబ్బంది చాలానే. అయితే ఆ విషయంలో రానా దగ్గుబాటి రేర్ బ్రీడ్ అనే చెప్పుకోవాలి.

కేరీర్ మొదటి నుండీ ఎక్కడా కూడా ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా చాలా జాగ్రత్తగా వెరైటీ సినిమాలు చేస్తూ ఉంటాడు. సహజంగా ఒక యాక్టర్ మల్టీస్టారర్ సినిమా చెయ్యాలంటే పక్కన ఎవరు… తన క్యారెక్టర్ నిడివి ఏంటి? ఇలా వంద లెక్కలు వేసుకుంటారు.

అయితే అటువంటి లెక్కలు ఏమీ లేకుండా రానా పవన్ కళ్యాణ్ పక్కన అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ చెయ్యడానికి ఒప్పుకున్నాడు. అయితే సినిమా మొదలైన నాటి నుండీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భజనే. ఎక్కడా కూడా మల్టీస్టారర్ అని కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలా మార్చేశారు.

రానాను ఏదో సైడ్ క్యారెక్టర్ గా చేసేశారు. అసలు ప్రమోషన్స్ లో అతని ఊసే లేదు. నిజమే రానా కంటే పవన్ కళ్యాణే పెద్ద స్టార్. కొంత వరకు అతని ఓరియెంటెడ్ గా సినిమా ఉండటం మాములే. అయితే అయ్యప్పనుమ్ కోశియుమ్ అనే సినిమాలో ఇద్దరు హీరోలు సమానమే.

అటువంటి సినిమాను కూడా వన్ సైడ్ చేసేస్తే… రానా లా ఏమీ ఆలోచించకుండా ఇటువంటి సినిమాలు ఒప్పుకునే వారికి ఇలా చేస్తే ఇబ్బందే. మునుముందు పెద్ద స్టార్ల తో సినిమా చెయ్యడానికే ఆలోచిస్తారు.