Pawan Kalyan questions jagan on kodi kathi and ys viveka caseప్రభుత్వంపై పూర్తి స్థాయిలో పోరుకు జనసేన పార్టీ సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం అయ్యిందంటూ జగన్ 100 రోజుల పాలన పై నివేదిక విడుదల చేసిన పవన్ కళ్యాణ్…. కోడి కత్తి, వైఎస్ వివేకా కేసులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చిన్నాన్న హత్యకేసులో ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయలన్నారు. దీంతో పాటు… విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసుపై పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… కోడికత్తి దాడిపై సీబీఐ విచారణ జరపాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయిందని డిమాండ్ చేశారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి వారం ముందే… కోడికత్తి దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. శ్రీనివాస్ బెయిల్‌పై బయటకు వచ్చాడని గుర్తు చేశారు. అందుకే కోడికత్తి కేసుపై కూడా స్పష్టమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

లేదంటే… వైఎస్ వివేకా హత్య కేసు, కోడికత్తి కేసుల్ని సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు జనసేనాని. అయితే కోడి కత్తి కేసులో నిందితుడు మళ్ళీ బెయిలు రద్దయి జైలుకు వెళ్ళిన సంగతి ఆయన మిస్ అయినట్టు ఉన్నారు. గతంలో ఈ రెండు కేసులలో వైఎస్సార్ కాంగ్రెస్ మీదే విమర్శలు వచ్చాయి. అధికారంలోకి వచ్చినా ఎటువంటి ముందడుగు పడకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. వాటిని ప్రస్తావించడంతో ప్రభుత్వాన్ని పవన్ ఇరుకునపెడుతున్నట్టుగా కనిపిస్తుంది.