Pawan Kalyan prasied KCR 24 hours power for farmers schemeనిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం సంచలనం సృష్టించింది. రైతులకు సరైన న్యాయం చేశారని కేసీఆర్‌ను పవన్‌ ప్రశంసించినట్లు తెలిసింది. రైతులు పడే కష్టానికి ఎంత చేసినా తక్కువేనని, వారి సమస్యల పరిష్కారానికి గొప్ప నిర్ణయం తీసుకున్నారని అభినందించినట్లు సమాచారం.

దేశవ్యాప్తంగా ఈ విధానం ఉండాలని, తాను వీలైతే ప్రధానిని కలిసి ఈ విషయం చెబుతానని అన్నట్లు సమాచారం. ఈ భేటీతో జనసేన తెరాస మధ్య పొత్తు పొడుస్తుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ నిజంగా జరిగితే కేసీఆర్ కరెక్ట్ టైమ్ లో జాక్ పాట్ కొట్టినట్టే. ఎలాగూ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ కు వ్యతిరేకమే.

కనీసం ఒక్కో నియోజవర్గంలో పవన్ అభిమానుల ఓట్లు 2000 నుంచి 3000 ఓట్ల వరకూ ఉంటాయి. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువై ఉండొచ్చు. ఈ సంఖ్య ఎందుకంటే గెలుపును డిసైడ్ చేసే ఓట్లు ఇవి. గవర్నమెంట్ సహజంగా ఉండే వ్యతిరేకతను ఎదురుకోవడానికి ఈ ఓట్లు చాలా ఉపయోగపడతాయనే చెప్పుకోవాలి.