గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తుంటే ఆయన పెద్దగా సీరియస్ గా లేరని, ఏదో సినిమాలు చెయ్యాలి కాబట్టి చేస్తున్నట్టు అనిపించకమానదు. 2019 ఎన్నికల తరువాత తిరిగి తెరంగేట్రం చేసిన ఆయన తనకు సినిమాల మీద ఆసక్తి లేదని.. రాజకీయాల కోసం డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు చెయ్యబోతున్నట్టు బాహాటంగానే ప్రకటించారు.
డాన్స్లు చెయ్యడం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేదు. ఈ మధ్య ఫైట్లు కూడా తగ్గించేశారు. గతంలో లేనట్టుగా పవన్ కళ్యాణ్ సినిమాలలో డూపుల వాడకం కూడా ఎక్కువైంది. దానితో అభిమానులు చాలా నిరాశపడుతున్నారు. అయితే వారి నెత్తి మీద పాలుపోసినట్టు ఆయన తదుపరి చిత్రం ‘హరి హర వీరమల్లు’ నిర్మాతలు ఒక మంచి వార్త చెప్పారు.
బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ షామ్ కౌషల్ ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ మొదలుపెట్టే ముందు ఒక షావోలిన్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ లో పవన్ కళ్యాణ్ షావోలిన్ ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.
చాలా రోజులకు పవన్ కళ్యాణ్ ఒక సినిమాను సీరియస్ గా తీసుకుంటున్నారని, ఈ సినిమాలోని యాక్షన్ పార్ట్ లో ఒకప్పటి పవన్ కళ్యాణ్ ను చూస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. Mirchi9 is looking for Content Writers who can write about Movies and Politics. Send your Resumes to [email protected] with Two Sample Articles (Resumes without Sample Articles will not be considered).




