pawan-kalyan-politics-moviesజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. అయితే ఇదే సమయంలో ఆయన సినిమాలకు, రాజకీయాలకు టైమ్ బాలన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు పవన్ నాలుగు రోజులు సినిమాకు షూట్ చేశారు.

షూటింగ్ కి వచ్చిన రోజు కూడా పూర్తిగా ఉండటం లేదు. సగం రోజు సినిమా షూటింగ్ సగం రోజు రాజకీయాలకు వెచ్చిస్తున్నారు. దీనితో షూటింగ్ పెద్దగా ముందుకు సాగడం లేదట. అయితే పింక్ రీమేక్ లో ఆయన పాత్ర లిమిటెడ్ కావడంతో పెద్దగా ఇబ్బంది లేదు.

అయితే తరువాత సినిమా ‘క్రిష్ తో పీరియడ్ సినిమా’ కు మాత్రం ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండకపోతే ఇబ్బంది అంటున్నాయి చిత్రవర్గాలు. క్రిష్ సినిమా కూడా ఈ నెలాఖరుకు ముహూర్తం జరుపుకుని, ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోతున్నారట. ఇది రాబిన్ హుడ్ తరహా పాత్ర అని అంటున్నారు. మొఘ‌లాయిల కాలానికి సంబంధించిన క‌థ ఇది. మ‌హ‌మ్మ‌దీయుల ప‌రిపాల‌నా కాలం, అప్ప‌టి ప‌రిస్థితులు… ఇవ‌న్నీ తెర‌పై చూపించ‌బోతున్నారు. పిరియాడిక్ డ్రామా కోసం భారీ సెట్లు వేయ‌బోతున్నారు. పవన్ కళ్యాణ్ తన కేరీర్ లో పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి.