Pawan Kalyan - pentapati pulla rao - janasenaరాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు మొదటి నుండీ ఎందుకో పోలవరం ప్రాజెక్టు మీద అనేక కేసులు వేసి వివాదాస్పదంగా మారారు. అయినా ఆయనను జనసేనలో చేర్చుకుని. ఏలూరు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికలో ఘోరంగా 6% ఓట్లు కూడా తెచ్చుకోలేక డిపాజిట్ కోల్పోయారు ఆయన. తదనంతరం ఆయన జనసేనలో యాక్టీవ్ గా లేరు.

తాజాగా ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రాజెక్టు అంచనాలు పెంచారని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో అవకతవకలు జరిగాయని అందులో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు .. దీనిని ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరులశాఖకు ఆదేశాలు జారీచేసింది.

తమ పరిధిలోని అంశం కాదు కాబట్టి దానిని కేంద్ర జలవనరులశాఖకు ఫిర్యాదుగా బదిలీ చేసింది. మరి తలపండిన రాజకీయ విశ్లేషకులు ఆ మాత్రం తెలియకపోవడం ఏంటో. మరోవైపు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పోలవరం తాజా అంచనాలు ఆమోదించింది. ఈ తరుణంలో కేసు వెయ్యడం అంటే విషయాన్నీ మరింత జటిలం చెయ్యడమే.

ఇప్పటికే కొత్త ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపేసింది. ప్రాజెక్టు టెండర్లను బట్టే 2021 వరకూ ప్రాజెక్టు పూర్తి కాదని స్పష్టం అవుతుంది. అంటే అనుకున్నదానికి ఒక ఏడాది ఆలస్యం. ఈ తరుణంలో ఈ కేసు వల్ల మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ దీనిపై ఎలా స్పందిస్తారో