Pawan Kalyan Panchayat Electionsఆంధ్రప్రదేశ్ లో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. పార్టీ రహిత ఎన్నికలు కావడంతో ఏ పార్టీ ఎన్ని గెలిచింది అనే అధికారిక ప్రకటన ఉండదు. కాబట్టి ఏ పార్టీ లెక్కలు వారివే అన్నట్టు ఉన్నాయి. ఎవరి లిస్టు లో వారికే ఎక్కువ రావడం గమనార్హం.

రెండు ప్రధాన పార్టీలు ఇలా ఉంటే జనసేన పరిస్థితి ఇంకోలా ఉంది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కనీసం ఫలితాలను ట్రాక్ చేసే వ్యవస్థ కూడా లేదు. అక్కడో వార్డు ఇక్కడో వార్డు గెలిచాము అన్నట్టు అభిమానులు సోషల్ మీడియాలో పెడితే తప్ప అసలు పార్టీ వైపు నుండి ఎటువంటి సమాచారం.

ఈరోజు ఉద్యయం కొన్ని స్థానాల లిస్టు సోషల మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది కూడా అభిమానులు తయారుచేసిందే. ఆ పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్య ఈరోజు ఒక టీవీ చర్చ కార్యక్రమానికి వెళ్తున్నాను జనసేన గెలిచిన స్థానాల లిస్టు ఇవ్వండి అని సోషల్ మీడియాలో అభిమానులను అడగడం పరిస్థితికి అర్ధం పడుతుంది.

ఇక అధికారికంగా విడుదలైన టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లిస్టుల బట్టి జనసేన – బీజేపీ కూటమి ఈ ఎన్నికలలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది అనే చెప్పుకోవాలి. అక్కడక్కడా గెలిచినవి కూడా ఆ పార్టీ కింద స్థాయి అభిమానుల వల్లే అనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రామా స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడే ఈ ఎన్నికలను జనసేన పార్టీ పూర్తిగా లైట్ తీసుకోవడం శోచనీయం.