Pawan Kalyan over confidence to become chief ministerఒకప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను సీఎం అవుతా, అయ్యాక ఆ పని చేస్తా ఈ పని చేస్తా అంటూ ఉంటే దానిని హేళన చేసేవారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ లా తనకు పదవీ కాంక్ష లేదని చెప్పుకునే వారు పవన్ కళ్యాణ్. అయితే గత కొంత కాలంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ లో కూడా మార్పు కనిపిస్తుంది.

సీఎం కాండిడేట్ అని చెప్పుకోకపోతే తనను ప్రజలు సీరియస్ గా తీసుకోరు అనుకున్నారో లేక అలా చెప్పకపోతే పార్టీ క్యాడర్ లో నమ్మకం కలగదు అనుకున్నారో పవన్ కూడా ఈ మధ్య నేనే సీఎం అంటూ ఊదరగొడుతున్నారు. కొన్ని కొన్ని సభలలో ఏకంగా చెప్పి మరి సీఎం అని పిలిపించుకుంటున్నారు.

మొన్న ఆ మధ్య ఒక సభలో పవన్ సీఎం కావాలన్న నినాదం ఒక మహామంత్రమని పవన్ చెప్పుకొచ్చారు. ఆ మహామంత్రమే ఒక తారకమంత్రమై తాను వచ్చే ఎన్నికలలో సీఎం కూర్చీలో కూర్చోబెడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. బహుశా పదవీ కాంక్ష లేని రాజకీయ నాయుడు అనేది జరగని పనేమో! కొందరు ప్రజలకు మంచి చెయ్యాలంటే పదవి ఉండాల్సిందే అంటారేమో! తప్పదు అనే మాట నుండే రాజకీయలలో అన్ని మొదలు అవుతాయి. పార్టీని పెంచుకోడానికి కుల రాజకీయాలు తప్పవు, అధికారంలోకి రావడానికి నోట్లు పంచడం తప్పదు, పక్క పార్టీల నాయకులు తప్ప యువనాయకుల వల్ల ఉపయోగం ఉండదు. ఇలా అన్నీ కొన్ని కొన్ని తప్పవు అనే దగ్గర నుండే మొదలవుతుంది.