pawan kalyanప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి లా పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రాగం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంతా కేవలం అమరావతికి మాత్రమే పరిమితమయ్యింది ఆరోపిస్తున్నారు. అమరావతి అంటూ ముఖ్యమంత్రి మిగతా జిల్లాలను పట్టించుకోవడం లేదని జనసేనాని తన జనసేన పోరాట యాత్రలో చేస్తున్న ఆరోపణ.

అయితే ఈ వాదన వల్ల పవన్ కళ్యాణ్ కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్ళినప్పుడు ఏం చెబుతారో చూడాలి. గతంలో ఇదే ఆరోపణ చేసి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ రెండు జిల్లాలలో ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అంటున్నారు.

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా బలపడదాం అని పార్టీలు అనుకోవడం సాధారణమే. అయితే విభజనానంతరం ఇటువంటి రాజకీయాలు రాష్ట్రానికి ఎంత మాత్రం మేలు చెయ్యవు. ఒక రాజధాని అభివృద్ధి అయితే ఆ ఫలాలు మొత్తం రాష్ట్రానికి దక్కుతాయ్. ఒక్క హైదరాబాద్ తెస్తున్న డబ్బుతో మొత్తం తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

అలాగే హైదరాబాద్ లో అక్కడి వారికే కాకుండా దేశం మొత్తం నుండి వచ్చిన వారికి ఉపాధి దొరుకుతుంది. అమరావతి అభివృద్ధి అయితే ఆ ఫలాలు ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కావు. అయితే ఇప్పుడు మన రాజకీయనాయకులకు అంతటి విచక్షణా జ్ఞానము ఉండకపోవడం ప్రజల దురదృష్టం.