Pawan Kalyan in Visakhapatnam Supporting Dredging Corporation of India Employees -టీడీపీ, బీజేపీ లకు ఓటు వెయ్యమని నేను అడిగాను అందుకే నేను నైతిక బాధ్యత తీసుకొని ఇవాళ మీ తరుపున ప్రశ్నిస్తున్నా అంటూ ముందుకు వచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటైజషన్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు పవన్ కళ్యాణ్ సంఘీ భావం చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన తాను ఈ విషయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లెటర్ రాయనున్నట్లుగా ప్రకటించారు. ఆ ఉత్తరం ప్రతిని కూడా ఆయన తనతోపాటు తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు నేను ప్రధానిని ఏమీ అడగలేదు… ఇప్పుడు డీసీఐని ప్రైవేటీకరించొద్దని లేఖ రాస్తున్నా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

డీసీఐకి అన్యాయం జరిగితే… భారతీయ జనతా పార్టీకి మొదటి ఓటమి విశాఖ నుంచి మొదలవుతుందని ఆయన హెచ్చరించారు. నిజమే ఆయన మోడీని ఇప్పటిదాకా కలిసింది లేదు. ఆయనకు కనీసం ఒక లెటరైనా రాసింది లేదు. ఇప్పుడు లెటర్ రాయడం మంచిదే దానిని ఆయన పట్టించుకుంటరో లేదో తరువాత విషయం.

కానీ ఇప్పటిదాకా ఇలాంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఎందుకు చెయ్యలేదు అని ఆయన ఆలోచించుకోవాలి. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు వఛ్చిన దాదాపు అన్ని సమస్యలు కేంద్రం వల్లే. లోటు బడ్జెట్ నిధులు కావొచ్చు, స్పెషల్ స్టేటస్ కావొచ్చు, స్పెషల్ ప్యాకేజీ కావొచ్చు, పోలవరం కి అడ్డుపుల్లలు కావొచ్చు, రాజధానికి అరకొర నిధులు కావొచ్చు ప్రతిదీ కేంద్రంతో ముడి పడే ఉంది. వాటిని పరిష్కరించడానికి మోడీకి ఒక లెటర్ రాయడం గాని, ఆయన కలిసే ప్రయత్నంగాని ఎందుకు చెయ్యలేదు అని తనని తాను ప్రశ్నించుకుంటే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి చాల ఉపయోగపడుతుంది. JanaSena