Pawan kalyan on the sets of Trivikram srinivas Aa Aaaఅభిమానుల చెంతకు పవన్ వెళ్ళడం ఇదే మొదటిసారి కాదు. సహజంగా సామాన్య అభిమానుల వద్దకు వెళ్ళే పవన్, ఈ సారి మాత్రం తనను అభిమానించే సినీ హీరో నితిన్ దగ్గరకు వెళ్లి ఆశ్చర్యపరిచారు. తన స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న “అ…ఆ…” సినిమా షూటింగ్ సెట్స్ లో పవన్ ప్రత్యక్షం కావడం నితిన్ అంతులేని ఆనందానికి కారణం అయ్యింది.

“తమ సెట్స్ కు అతిధిగా పవన్ విచ్చేసారని, పవన్ ముందు అభినయించాలంటే నెర్వస్ తో పాటు సంతోషంగా ఉంటుందని…” పవన్ తో చిత్ర యూనిట్ ఉన్న ఒక ఫోటోను షేర్ చేసాడు హీరో నితిన్. దర్శకుడు త్రివిక్రమ్ – పవన్ ముచ్చటించుకుంటుంటే.., నితిన్ పక్కన ఉండి ఆలకిస్తున్న వైనం ఈ ఫోటోలో తారసపడుతోంది. ‘సర్ధార్’ రిలీజ్ తర్వాత గడ్డం తీసేసి డిఫరెంట్ లుక్ లో పవన్ ప్రస్తుతం కూడా అదే లుక్ తో కొనసాగుతున్నారని తాజా ఫోటో స్పష్టం చేస్తోంది.