pawan-kalyan-on-notes-ban-janasenaఓ అయిదు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి సర్కార్ విధానాలను ప్రశ్నిస్తూ తన స్పందనను తెలియజేస్తానని చెప్పిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్.., ఆ క్రమంలో తొలుత గోసంరక్షణ, గోమాంసంపై స్పందించారు. ఆ తర్వాత రోహిత్ వేముల, దేశభక్తి అంశాలను కూడా ప్రస్తావించారు. రోజుకొకటి చొప్పున ప్రస్తావిస్తున్న పవన్ కళ్యాణ్, నాలుగవ నెంబర్ లో ఉన్న “నోట్ల రద్దు” విషయాన్ని పక్కన పెట్టడం గమనించదగ్గ విషయం.

‘దేశభక్తి’పై పోస్ట్ చేసిన పవన్, తర్వాత ‘ఏపీ స్పెషల్ స్టేటస్’పై తన భావాలను వ్యక్తపరుస్తానని అన్నారు. నాలుగవ అంశం వదిలి, అయిదవ అంశంపై చెప్పడం వెనుక ఉద్దేశం… ఇంకా నోట్ల రద్దుపై పవన్ ఓ నిర్ణయానికి రాలేకపోయారా? దీనిపై తానూ ఇంకా సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారా? ఏమో విషయం ఏదైనా… వరుస క్రమంలో చెప్తూ వస్తున్న పవన్, నోట్ల రద్దును పక్కనపెట్టి, ప్రత్యేక హోదాపై స్పందిస్తానని చెప్పడం ప్రాధాన్యతను దక్కించుకుంది.

ఇదిలా ఉంటే… ప్రజలంతా కూడా ‘స్పెషల్ స్టేటస్’ రాదని మానసికంగా ఫిక్స్ అయిపోయిన వేళ, కొత్తగా దీనిపై పవన్ ఎలాంటి నినాదాన్ని తీసుకుంటారు. ఒకవేళ తీసుకున్నా… దానికి ప్రజల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుంది? ఓ పక్కన జగన్ ఇదే అంశాన్ని తన రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటున్న దరిమిలా దానిని మించిన స్టెప్ తీసుకుంటే గానీ, ప్రజలను తన వైపుకు తిప్పుకోగలుగుతారు. చూద్దాం… జనసేన బాణీ ఎలా ఉంటుందో..!