Pawan Kalyan  offering MP seat to Mudragada Padmanabhamప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కాపు రేజర్వేషన్లపై యూ టర్న్ తీసుకున్న నాటి నుండి ఆయన పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు మీద అన్ని రకాలుగానూ దుమ్మెత్తి పోసిన ముద్రగడ తెలుగు దేశానికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. మొన్న ఆ మధ్య కాపు రేజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారిగా స్పందించారు.

కాపుల వెనుకబాటుతనాన్ని తాము గుర్తించామని, కాపులకు రేజర్వేషన్లు ఇచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనితో ముద్రగడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. కాపు ఓట్లను గంపగుత్తుగా తనవైపు తిప్పుకునేందుకు ముద్రగడను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంట.

దీనిలో భాగంగా ముద్రగడ తనకు సంపూర్ణ మద్దత్తు ఇస్తే వచ్చే ఎన్నికలలో ఆయనకు కాకినాడ ఎంపీ టిక్కెట్టు ఇవ్వడానికి సిద్ధం అని ఆయన రాయభారం పంపారట. పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి పర్యటన సంధర్భంగా దీనిపై క్లారిటీ రావొచ్చు. అన్ని కుదిరితే ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారు జనసేనాని.