Pawan-Kalyan's-Filmy-Remark-Sets-Twitter-Afire!!పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ పేరు వింటేనే ఫాన్స్ అభిమానంతో ఊగిపోతారు. ఇక పవన్ కి ఉన్న మాస్ మ్యానియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అయితే మరి అలాంటి పవర్ స్టార్, ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లోకి వచ్చినట్లుగా జనసేన అంటూ పొలిటికల్ లీడర్ గా ప్రజలను పలకరిస్తున్నాడు. అయితే 2014లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఇరు పార్టీలకు మద్దతుగా నిలిచిన పవన్ ఇప్పుడు 2019లో ఒంటరి పోరుకు సిద్దం అయ్యాడు.

మరి 2019లో పవన్ గెలుస్తాడా లేదా? అన్న మాట కాసేపు పక్కన పెట్టేస్తే, అజ్ఞాతవాసి తర్వాత పవన్ ఇక సినిమాలు చెయ్యను అనడంతో ఒకసారిగా షాక్ తిన్నారు ఆయన ఫాన్స్. ఇక పవన్ ని తెర మీద చూడలేమా అంటూ తెగ ఫీల్ అయిపోయారు. కానీ ఒక పక్క ప్రజా సేవ చేస్తూ కూడా సినిమాలు చెయ్యవచ్చు అన్న విషయంలో భాగంగా పవన్ డైరెక్ట్ సినిమా కాకపోయినా ఒక కుర్ర హీరో చేస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడట. అయితే గోపాల గోపాలలో దేవుడి పాత్ర పోషించిన పవన్ ఈ కుర్ర హీరో సినిమాలో ఏకంగా 45 నిమిషాల పాటు ఒక ప్రధానమైన, పవర్‌ఫుల్ పాత్రలో ఇరగదియ్యనున్నాడట.

ఇక ఈ విషయంపై ఇంకా అధికారిక వార్త బయటకు రాలేదు కానీ, సినిమా సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం, ఈ సినిమాలో పవన్ పాత్ర 45 నిమిషాల పాటు ఉండనుంది అని, అదే క్రమంలో ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిస్తుంది అని, ఈ సినిమాను వచ్చే 2019 ఎలెక్షన్స్ ముందే రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మరో పక్క పవన్ అటు జనసేన కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నందున తక్కువ కాల్ షీట్స్ తీసుకుని పవన్ పాత్రను షూట్ చెయ్యాలి అన్నది ఈ చిత్ర యూనిట్ ఆలోచనగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని రవి తేజతో నేల-టికెట్ సినిమా నిర్మించిన రామ్ తాళ్ళూరి, ఎస్ఆర్ అర్టీ ఎంటర్‌టేన్‌మెంట్స్ పై నిర్మించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కధ, దర్శకుడు, మిగిలిన వివరాలు త్వరలోనే తెలుస్తాయి అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మొత్తంగా చూసుకుంటే మాత్రం పవన్ సినిమాలకు దూరం అయిపోయాడు అంటూ ఫీల్ అవుతున్న ఫాన్స్ కి ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే 45 నిమిషాల పాత్ర అంటే మమోలు విషయం కాదు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం పవన్ ఫాన్స్ పండగ చేసుకోండి!