Pawan-Kalyan-New-Look!గత ఆరు నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్నా ఇప్పటివరకు ఫస్ట్ లుక్ కాదు కదా, టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించకపోవడంతో, పవర్ స్టార్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో పది రోజుల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉండడంతో, ఆ రోజున ఖచ్చితంగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారన్న సమాచారం ఉంది. దీంతో పవన్ పుట్టినరోజును ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ తో గ్రాండ్ గా జరుపుకోవడానికి అభిమానులు మానసికంగా సిద్ధమైపోయారు.

ఈ తరుణంలో తాజాగా పవన్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఫస్ట్ లుక్’గా చిత్ర యూనిట్ విడుదల చేయనున్న పోస్టర్ ఇదేనంటూ హంగామా చేస్తున్న ఈ పోస్టర్ లో పవన్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే గొడుగు పట్టుకుని సింపుల్ గా కూర్చుని ఉన్న పవన్ గడ్డం లుక్ త్రివిక్రమ్ సినిమాలోనిదా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అనేక ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి చక్కర్లు కొట్టాయి గానీ, అందులో ఎక్కడా పవన్ గడ్డంతో కనిపించలేదు. దీంతో ఇది త్రివిక్రమ్ సినిమాలోనిదేనా? ఒకవేళ అదే అయితే ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ ఇదేనా? అన్న మీమాంసలో అభిమానులు ఉన్నారు. అయితే త్రివిక్రమ్ సినిమాలోది అయినా కాకపోయినా, ఫస్ట్ లుక్ కాకున్నా… అందులో పవర్ స్టార్ అదిరిపోయాడు కాబట్టి, ఈ సింపుల్ పోస్టర్ ఫ్యాన్స్ కు ‘ఫుల్ కిక్’ ఎక్కిస్తోంది.